మెగాస్టార్ చిరంజీవి 9Mega Star Chiranjeevi) , స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం సూపర్ హిట్ టాక్ తో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మొదటి వారం ముగిసేనాటికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.292 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి. ఇదే జోష్ లో ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) తదుపరి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిరంజీవి, బాబీ (Bobby) కాంబోలో రాబోతున్న సినిమా ఇప్పటికే మెగా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి 25న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవిని (Chiranjeevi) మునుపెన్నడూ లేని విధంగా చూపించాలని డైరెక్టర్ బాబీ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ చిత్రానికి సంబంధించి స్టోరీ లైన్ ఒకటి బలంగా వినిపిస్తోంది. సోషల్‌మీడియాలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఇది కూతురి సెంటిమెంట్‌తో ముడిపడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, కూతురు కోసం తండ్రి ఏం చేశాడు అనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీంట్లో మలయాళ అగ్రహీరో మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఓ క్యామియో రోల్ ఉందని. ఈ కీలక పాత్రలో ఓ టాలీవుడ్ యువ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో ఆ యువ హీరో కనిపిస్తాడని అంటున్నారు. అలాగే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. చిరు భార్యగా ఒక సీనియర్ హీరోయిన్ అలాగే కూతురిగా ఒక యువ కథానాయిక కనిపించనున్నారని తెలుస్తోంది. కాగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

