ఓవర్సీస్‌లో ‘అనగనగా ఒక రాజు’ సెన్సేషనల్ రికార్డ్

by | Jan 20, 2026 | సినిమా

టాలీవుడ్ యువ హీరో నవీన్‌ పొలిశెట్టి (Navin Polishetty), యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) జోడీగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju). ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కొత్త డైరెక్టర్ మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న భారీ ఎత్తున విడుదలై అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కేవలం అయిదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ 100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి, బాక్సాఫీస్‌ రికార్డులను ఈ సినిమా తిరగరాసింది.

అంతకుముందు హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ మూడు సినిమాలు సాలిడ్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీ రూ.100 కోట్ల గ్రాస్‌ మార్క్‌ అధిగమించి.. నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో రూ.100 కోట్ల సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇక్కడే కాకుండా ఓవర్సీస్‌లో ప్రత్యేకించి యూఎస్‌ మార్కెట్‌లో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా $1.5 మిలియన్ల మైలురాయిని అధిగమించింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే ఫుల్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.