ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. ‘ఫౌజీ’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

by | Jan 20, 2026 | సినిమా

రెబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ‘సీతా రామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజి’. ఇందులో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీతారామం వంటి క్లాసిక్ హిట్ తరువాత హను రాఘవపూడి ప్రభాస్ (prabhas) తో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్ర శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్, రాహుల్‌ రవీంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

కాగా, ‘ఫౌజీ’ (Fouji) రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ నేపథ్యంలో జరిగే హిస్ట్టారికల్‌ రొమాంటిక్‌ డ్రామాగా ‘ఫౌజీ’ తెరెకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ రోజే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం.