చికిరి చికిరి సాంగ్ మేకింగ్ ; 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్
రామ్ చరణ్, జాహ్నవి కపూర్ హీరో హీరోయిన్లు గా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకుడు. పెద్ది చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ స్వర సారధ్యం వహిస్తున్నారు.
ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సింగల్ ‘చికిరి చికిరి’ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తోంది..
ఈ చికిరి చికిరి సాంగ్ మేకింగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్ చేయడానికి ఎంత మంది, ఎంత కష్ట పడ్డారు అనే విషయాన్ని ‘మేజిక్ అఫ్ చికిరి చికిరి’ పేరుతో స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ పాట కోసం 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు తెలిపారు
ఈ మ్యాజికల్ వీడియో ని మీరు చూసేయండి.

