బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నే అంచనాలు భారీగా ఉంటాయి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2’ మీద అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.
నిన్న శుక్రవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖండ 2 టీజర్ విడుదల చేశారు. గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అఖండ కు సీక్వెల్ అఖండ 2. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు
14 రీల్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట, గోపి ఆచంట లు ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ స్వర సారధ్యం వహించారు
బి బ్రేవ్ అంటూ బాలయ్య పలికిన ఒకటి రెండు సంభాషణలు తప్ప ఈ టీజర్ లో పెద్దగా ఏమి లేదు. ట్రైలర్ విడుదల తరవాత వచ్చిన ఫీడ్ బ్యాక్ వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ టీజర్ విడుదల చేసినట్లుంది.

