MSVP Garu శాటిలైట్, ఓ టి టి రైట్స్ దక్కించుకున్న ఛానల్

by | Nov 29, 2025 | సినిమా

Mana Shankara Vara Prasad Garu : మనశంకరవరప్రసాద్ గారు శాటిలైట్, ఓ టి టి రైట్స్ దక్కించుకున్న జీ తెలుగు, జీ 5

మెగాస్టార్ చిరంజీవి, నయన తార నటిస్తోన్న మనశంకర వర ప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  అయితే డేట్ ని ప్రకటించాల్సి ఉంది.  ఈ సినిమా నుండి విడుదలైన మొదటి సింగల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ 70 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపుతోంది

ఈ సినిమాకు సంబందించిన శాటిలైట్, ఓ టి టి రైట్స్ ను జీ నెట్ వర్క్ వారు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.  గతంలో జీ తెలుగు అనిల్ రావిపూడి సినిమా ‘ఎఫ్ 3’ హక్కులు కొన్న విషయం తెలిసిందే.

మనశంకరవరప్రసాద్ గారు చిత్తాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.  భీమ్స్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు

అనిల్ రావిపూడి జీ తెలుగు డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జి గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిన విషయం అందరికి తెలిసిందే.

.