టెలివిజన్ రంగంలో, మన తెలుగు మార్కెట్ లో స్టార్ మా నెంబర్ వన్ ఛానల్ అని మనందరికీ తెలిసిందే. స్టార్ మా కార్యక్రమాలు రేటింగ్స్ లో సరి కొత్త రికార్డు లు నెలకొల్పుతూ దూసుకు పోతోంది.
స్టార్ మా లో ప్రస్తుతం ప్రసారమవుతోన్న బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ సరికొత్త రికార్డు లు సృష్టిస్తోంది. గత 5 సీజన్ల లో అత్యధికంగా 11.2 రేటింగ్ సాధించింది ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ 9.
అంతే కాకుండా స్టార్ మా ఛానల్ 1081 గ్రాస్ రేటింగ్ పాయింట్లను సాధించింది. గత మూడు సంవత్సరాలలో ఇదే అత్యధికం
ప్రైమ్ టైం లో అద్భుతమైన సీరియల్స్ , బిగ్ బాస్ తో అత్యధికంగా 486 గ్రాస్ రేటింగ్ పాయింట్లు సాధించింది. గత 205 వారాలలో ఇదే అత్యధికం.
ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఇవ్వడంలో స్టార్ మా ఛానల్ ముందుంటుంది. వినూత్నమైన కథలతో సీరియల్స్, వినూత్నమైన నాన్ ఫిక్షన్ లతో పాటు ప్రతి ఆదివారం ఒక సరికొత్త కథలతో వచ్చే ప్రీమియర్ సినిమాలను అందిస్తూ అగ్రపథంలో దూసుకు పోతోంది స్టార్ మా.
బిగ్ బాస్ అయిపోయాక లాంచ్ చేయడానికి మరో రెండు కొత్త సీరియల్స్ నువ్వు లేక నేను లేను, పొదరిల్లు వంటి సీరియల్స్ ను సిద్ధం చేస్తోంది.


