పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthaad Bhagath Singh) . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా (Rashi Khanna) కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఈ సినిమా ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠంలో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ గ్రాండ్ లాంచ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే దర్శకుడు హరీశ్ శంకర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ డైలాగ్‌లు ఉండవని, ఏ వ్యక్తిని, పార్టీని కించపరిచేలా ఈ చిత్రం ఉండదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగానే ఈ సినిమా ఉంటుందని, పవన్ కళ్యాణ్ పెర్‌ఫార్మెన్స్ బద్దలైపోతుందని వెల్లడించారు.
ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొంతమంది ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు, విమర్శలు లాంటివి ఉంటాయా అని అడుగుతున్నారు. ఇందులో ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్‌లు ఉండవు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్ (Aura of Usthaad) సాంగ్‌కు వస్తున్న స్పందన బాగుంది. కొంతమంది అభిమానులు లిరిక్స్ ఎడిట్ చేసి పంపిస్తుంటే సంతోషంగా ఉంది. ఇంతకుముందు పాటకు డ్యాన్స్ బస్టర్ అని పెట్టారు కదా, దీనికి ట్రాన్స్బస్టర్ పేరు పెట్టాలని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు. అయితే ఈ సాంగ్ పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండడంతో కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా.. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. సినిమాను కేవలం సినిమాలాగా చూడండి, రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని సినిమా ప్రారంభమైన మొదటి రోజునే పవన్ కళ్యాణ్ మాకు చెప్పారు. మేము అదే అనుసరిస్తున్నాం.. పవన్ కళ్యాణ్ లు సిద్దాంత పరంగా ప్రకాశ్‌రాజ్‌తో విబేధాలు ఉన్నప్పటికీ ఆయనతో కలిసి వకీల్‌సాబ్, ఓజీ సినిమాలు చేశారు అది ఆయన గొప్పతనం. ఇక ఈ సినిమాలో డైలాగ్‌లు, సన్నివేశాలు ఏ వ్యక్తిని, పార్టీని, వర్గాన్ని కించపరిచేలా లేవు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఇక ఇందులో గాజు డైలాగ్ పెట్టాం అంటే అది హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చేందుకు మాత్రమే పెట్టాం. అది ఇతరులను తక్కువ చేయడంగానీ, సెటైర్లు వేయడం కానీ, వెటకారం కానీ చేసేందుకు కాదు. అన్ని పార్టీల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు ఓట్లు ఎవరికి వేసినా సినిమా అంటే పవన్ దగ్గరికే వస్తారు. పవన్‌కల్యాణ్‌గారి సిద్ధాంతాలను ఫాలో అవుతున్న ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు. ఇందులో ఎలాంటి పొలిటికల్ డైలాగులు, సెటైర్లు ఉండవు అని వివరణ ఇచ్చారు దర్శకుడు హరీశ్ శంకర్.

