ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాక్ అవుట్ !

by | Feb 23, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.  భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్థాన్ పంపడానికి బీసీసీఐ నిరాకరించడం వలన, భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు

భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో నిలవాలంటే, గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమితో, పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాక్ నిష్క్రమించినట్లే అనిపిస్తోంది.  ఏదో అద్భుతం జరిగితే తప్ప నిష్క్రమించినట్లే

ఎందుకంటే, గ్రూప్ ఏ లో ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. 

భారత దేశం (మన దేశం) ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్ల మీద గెలిచి 4 పాయింట్లతో పాజిటివ్ రన్ రేట్ తో ఉంది

మరో పక్క న్యూజిల్యాండ్ ఇప్పటికే పాక్ మీద గెలిచి 1.2 నెట్ రన్ రేట్ తో ఉంది. న్యూజిలాండ్ ఇంకా భారత్, బంగ్లాదేశ్ ల తో ఆడాల్సి ఉంది

న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మీద గెలవడం గ్యారంటీ. ఏదో అద్భుతంగా జరిగితే తప్ప బంగ్లాదేశ్ గెలవడం దాదాపు అసాధ్యమే. 

పాకిస్థాన్ కు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అది కూడా బాంగ్లాదేశ్ తో

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు గ్రూప్ లు ఉన్నాయి. గ్రూప్ లో ఉన్న మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లు సెమి ఫైనల్ కి వెళతాయి

భారత్, న్యూజిలాండ్ లు రెండేసి లేదా మూడేసి విజయాలతో మొదటి రెండు స్థానాలలో ఉంటే ఇక పాకిస్థాన్ కు అవకాశం ఎక్కడ ఉంటుంది

పోరాడాల్సిన మ్యాచ్ లలో దారుణమైన ఆట తీరుతో టోర్నీ నుండి పాక్ నిష్క్రమించినట్లే.  న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ 90 బంతులు ఆడి 64 పరుగులు చేశాడు.  టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా ఈ తరహా బ్యాటింగ్ ఈ మధ్య చూడట్లేదు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు చేశాడు.  పాకిస్థాన్ ఓటమికి కొంత వరకు వీరిద్దరూ కారణమని చెప్పవచ్చు. జట్టుగా సమిష్టిగా రాణించలేకపోవడం కూడా పాక్ ని ఓడించింది