ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 7. 3 ఓవర్ లు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది
కింగ్ కోహ్లీ (King Kohli) 111 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెరీర్ లో 51 వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు
242 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు పాక్ తడబడిన పిచ్ పై ఏమాత్రం తడబాటు లేకుండా, పిచ్ లో కుదురుకుంటే పరుగులు సాధించవచ్చని నిరూపించింది
కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడి 20 పరుగులు చేసి షహీన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ తో రెండవ వికెట్ కు 69 పరుగులు జోడించాడు 46 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్, స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు
ఆ తరవాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఛాంపియన్స్ ట్రోఫీ లో మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ తో మూడవ వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేసి ఖుష్ దిల్ షా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన హార్దిక్ పాండ్య 8 పరుగులు చేసి షహీన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
అంతకు ముందు టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, 49.4 ఓవర్లలో 241 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
ఓపెనర్లు బాబర్ అజామ్, ఇమాముల్ హాక్ ఆచి, తూచి ఆడుతూ మొదటి వికెట్ కు 41 పరుగులు జోడించారు. అయితే 23 పరుగులు చేసినా బాబర్ ఆజామ్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇమాముల్ హాక్ 10 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడుz
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ మూడవ వికెట్ కు 104 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ ఎక్కువ బంతులు ఆడేశారు. ముఖ్యం రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్ తరహా ఆట ఆడాడు
62 పరుగులు చేసిన సౌద్ షకీల్ పాండ్య బౌలింగ్ లో అవుట్ అవ్వగా, రిజ్వాన్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు
వీరిద్దరూ అవుట్ అయ్యాక క్రమం తప్పకుండా పాక్ వికెట్లు పడుతూ వచ్చాయి. భారత్ జట్టు స్పిన్నర్లు, పేసర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాట్స్ మన్ పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
ఖుష్ దిల్ షా ఒక్కడే ఒక వైపు నిలబడి స్కోర్ బోర్డు ను కదిలించాడు. ఖుష్ దిల్ షా 38 పరుగులు చేసి చివరి వికెట్ గా వేణు తిరిగాడు
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్,జడేజా, రానా తలా ఒక వికెట్ తీశారు. పేసర్లు షమీకు ఒక వికెట్ కూడా దక్కలేదు

