మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ16’ సినిమాపై ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్సీ16’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే, తాజాగా ‘ఆర్సీ16’ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్ లో స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లోనే ముఖ్య సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్, టీజర్‌ను (Teaser) రామ్‌చరణ్ (Ram Charan) బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇది తెలిసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

