రజనీకాంత్ ‘కూలీ’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్!

by | Feb 24, 2025 | సినిమా

త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా..   మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ క‌డుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా.. వచ్చే వారం చెన్నై శివార్లలో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ రజనీకాంత్ మీద కొన్ని స్పెషల్ ఫైట్ సీన్స్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి ఏప్రిల్  మొదటి వారంలోనే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేయాలని బావిస్తున్నారట మేకర్స్. అలాగే ఈ సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం బుట్ట బొమ్మ పూజా హెగ్దేను తీసుకోబోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావాల్సి ఉంది.