ఛాంపియన్స్ ట్రోఫీ ముందు సౌత్ ఆఫ్రికా పై భారీ లక్ష్యాన్ని చేధించిన పాక్, భారత్ కు హెచ్చరికలు పంపిందా అంటే అవుననే చెప్పాలి. అనిశ్చితికి మారు పేరు అయినా క్రికెట్ లో ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారిదే విజయం. ఈ సారి భారత్ ఆడే మ్యాచ్ లు యూ ఎ ఈ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనున్నాయి. మిగతా మ్యాచ్ లకు పాక్ వేదిక కాబోతోంది. ఈ మధ్యే పాక్ అధ్యక్షుడు ఏం చెప్పాడో తెలుసా. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాదు భారత్ ను ఓడించాలి అని పాక్ అధ్యక్షుడు, పాక్ జట్టు సభ్యులకు చెప్పాడు.
పాక్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ముక్కోణపు సిరీస్ లో భాగంగాసౌత్ ఆఫ్రికా, పాక్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో పాక్ 352 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండాగానే చేధించింది. అది కూడా 91 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరవాత.
కెప్టెన్ రిజ్వాన్ 122 పరుగులు చేయగా, సల్మాన్ ఆఘా 103 బంతుల్లో 134 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగవ వికెత్కు 260 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
శుక్రవారం, అంటే రేపు, ఫిబ్రవరి 14 న పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది
మరో పక్క శ్రీ లంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి వన్ డే లో, శ్రీ లంక, ఆస్ట్రేలియా ను 49 పరుగుల తేడాతో ఓడించింది.
మరో ఆరు రోజుల్లో అంటే ఫిబ్రవరి 19 న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవబోతోంది.

