​ఎదురుచూపులకు చెక్‌.. ‘ఫౌజీ’లో ప్రభాస్‌ లుక్‌ రివీల్‌

by | Feb 13, 2025 | సినిమా

సలార్, కల్కి సినిమాల విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. ప్రభాస్ వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ “రాజా సాబ్” మూవీతో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికైతే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వీ అనే యంగ్​ బ్యూటీ నటిస్తుండగా.. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

కాగా, ఈ చిత్రంలో ప్రభాస్​తో పాటు మిథున్‌ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫౌజీ మూవీలోని ప్రభాస్ లుక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్​ ఖేర్​ కూడా చేరినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రభాస్​తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఇందులో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి, డిఓపి సుదీప్ చటర్జీ కూడా ఉన్నారు. ఇందులో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదిరిందంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.