అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. ఉత్తమ నటుడు, నటి ఎవరంటే?

by | Mar 3, 2025 | వార్తలు

యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ (Oscar) అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వేడుకను ఏబీసీ, జియో హాట్‌స్టార్, స్టార్ మూవీస్, హులు, యూట్యూబ్ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్ టీ టీవీలు లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. మరి ఏయే కేటగిరీల్లో, ఎవరెవరిని ఈ అవార్డు వరించిందో చూసేయండి.

  • ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్‌ పెయిన్‌)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్‌క్లేవ్‌)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – పాల్ టాజ్‌వెల్ (విక్‌డ్‌)
  • ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ – (ఫ్లో)
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- ఇన్‌ ద షాడో ఆఫ్‌ ద సైప్రెస్‌
  • ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ – ది సబ్‌స్టాన్స్‌
  • ఉత్తమ ఎడిటింగ్ – సీన్‌ బేకర్‌ (అనోరా)
  • ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్)
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – ‘ఎల్ మాల్’ (ఎమిలియా పెరెజ్)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్‌డ్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌– నో అదర్ ల్యాండ్
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా