ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్లు
ఛాంపియన్స్ ట్రోఫీ లో గ్రూప్ ఎ, గ్రూప్ బి జట్లలో అన్ని మ్యాచ్ లు గెలిచినా ఏకైక జట్టు ఇండియా. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ, ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్ లు, సౌత్ ఆఫ్రికా ఆడిన ఒక మ్యాచ్ వర్షం వలన రద్దు అయ్యాయి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు
ఇంగ్లాండ్ : క్రికెట్ కు పుట్టినిల్లు, మేటి జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ ఆడిన మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. 350 పరుగులు చేసిన తరవాత కూడా, మ్యాచ్ ను ఆస్ట్రేలియా చేతి నుండి ఇంగ్లాండ్ బౌలర్లు కాపాడ లేకపోయారు.
ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్టు ఇంగ్లాండ్ పై 325 పరుగులు చేయగలిగిందంటే ఇంగ్లాండ్ బౌలింగ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 325 పరుగులను చేధించలేక, ఒత్తిడిని తట్టుకోలేక అల్ అవుట్ అయినా ఇంగ్లాండ్ పరిస్థితి ఇంత దారుణంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు
పాకిస్థాన్ : పాకిస్థాన్ గత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న జట్టు, పాకిస్థాన్. ఛాంపియన్స్ ట్రోఫీ కి వేదిక. అలవాటైన సొంత పిచ్ లు, అభిమానుల మధ్య ఆట. మరో వైపు పాకిస్థాన్ ప్రెసిడెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కాదు భారత్ ను ఓడించి రావాలని స్పీచ్ లు. చివరకు ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించడం. బంగ్లాదేశ్ తో మ్యాచ్ రద్దు అవడం పుణ్యమా అని ఒక పాయింట్ అన్న తెచ్చుకుంది
బంగ్లాదేశ్ : ఒకప్పుడు పోరాటానికి మరు పేరుగా ఉన్న బంగ్లాదేశ్, ఇప్పుడు ఆట మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ముసాఫికర్ రెహ్మాన్, సఖిబుల్ హాసన్, తమీమ్ ఇక్బాల్, మొహ్మదుల్లా లాంటి ప్లేయర్స్ తో బలంగా ఉండే బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు అనిశ్చితికి మారు పేరుగా కనిపిస్తోంది. భారత్ తో మ్యాచ్ లో హృదయ్, జేకర్ అలీ బాగానే పోరాడినప్పటికీ, అప్పటికే జట్టుకు జరగాల్సిన నష్టం జరిగింది
ఆఫ్ఘనిస్తాన్ పోరాడి ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టును ఓడించింది.
సెమి ఫైనల్ కు చేరిన నాలుగు జట్లలో ఒక్క న్యూజిలాండ్ మాత్రమే ఒక మ్యాచ్ ఓడిపోయింది. మిగతా జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమి ఫైనల్ కు చేరాయి
భారత జట్టు, ఆస్ట్రేలియా తో మార్చ్ 4 న సెమి ఫైనల్ లో తలపడుతుంది. మార్చ్ 5 న, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా తో మరో సెమి ఫైనల్ లో తలపడుతుంది

