‘ఓదెల 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

by | Apr 7, 2025 | సినిమా

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్‌ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్‌, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్‌ నంది (Sampath Nandi) టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాంతార ఫేం అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగియగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు చిత్రబృందం.

‘ఓదెల 2’ ట్రైలర్‌ని (Odela -2 Trailer) ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముంబైలోని పశ్చిమ బాంద్రాలో ఉన్న గెలాక్సీ థియేటర్ లో ఈ ట్రైలర్ లాంచ్ వేడుక జరగనుంది వెల్లడించింది. ఈ ఈవెంట్‌కి చిత్ర బృందంతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుండగా ప్రస్తుతం పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘ఓదెల 2’ మూవీని మొదటి భాగాన్ని మించి ఉండేలా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించినట్లు టీజర్ తోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో తమన్నా (Tamannah) నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమ్మన్నా పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.