తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తోన్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా ఈ నెల 10 న విడుదలవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
అజిత్ కు తమిళ్ నాడు లో ఇప్పటికి వీరాభిమానులు ఉన్నారు. అజిత్ సినిమా విడుదల అంటే ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే గుడ్ బాడ్ అగ్లీ విడుదలవుతున్న సందర్భంగా అభిమానులు 285 అడుగుల కట్ అవుట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కట్ అవుట్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అక్కడి అభిమానులు పరుగులు తీశారు. ఈ వీడియో సోషల్ మిడిల్ లో వైరల్ అవుతోంది.

