‘రాక్’గా ఎన్టీఆర్.. ‘జైలర్’ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!

by | Mar 11, 2025 | సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్’, దేవర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్‌’ మూవీ ఫేమ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)తో పాన్‌ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. దింతో పాటుగా ఎన్టీఆర్‌ అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ‘వార్‌-2’ మూవీ షూటింగ్‌లోను పాల్గొంటున్నాడు. అయితే, ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్‌తో తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. డాక్టర్, జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన నెల్సన్ ఎన్టీఆర్ (NTR) కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ తో ‘జైలర్-2’ సినిమాను రూపొందిస్తున్న నెల్సన్ ఈ సినిమా ముగిసిన తర్వాత ఎన్టీఆర్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రాక్’ అనే టైటిల్‌ ఖరారు చేశారని ప్రచారం జరుగుతున్నది. ఇందులో ఎన్టీఆర్‌ను (NTR) అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా నెల్సన్ రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించబోతోన్న ఈ ప్రాజెక్ట్ కు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2026 లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.