WPL : గుజరాత్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ విజయం

by | Mar 10, 2025 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది

టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదట్లోనే ముంబై ఇండియన్స్ ఓపెనర్ అమేలియా కెర్ 5 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యింది. కాసేపటికి, 22 బంతుల్లో 27 పరుగులు చేసిన మరో ఓపెనర్ మాధ్యుస్ కూడా అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది

అయితే ఆ తరవాత వచ్చిన నాట్ సీవర్ బృంట్, కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ లు మూడవ వికెట్ కు 59 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 38 పరుగులు చేసిన బృంట్ ను గార్డనర్ అవుట్ చేసింది.  ఆ తరవాత వచ్చిన అమన్ జోత్ కౌర్ తో కలిసి హర్మాన్ ప్రీత్ కౌర్ ధాటిగా ఆడడం మొదలు పెట్టారు.

హర్మాన్ 33 బంతుల్లో 54 పరుగులు, అమన్ జ్యోత్ 15 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  ఆఖర్లో సజీవన్ సజన, యాస్తికా భాటియా లు 10 బంతుల్లో 24 పరుగులు చేశారు

గుజరాత్ జెయింట్స్ బౌలర్ల లో తనూజ కన్వర్, ప్రియా మిశ్రా, గార్డనర్, కాశ్వీ గౌతమ్ లు తలా ఒక వికెట్ తీశారు 

అనంతరం 180 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ 41 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది

ఓపెనర్లు బెత్ మూని 7 పరుగులు, కాశ్వీ గౌతమ్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  ఆ తరవాత వచ్చిన కెప్టెన్ గార్డనర్ డక్ అవుట్ అయ్యారు.  ఆ తరవాత ధాటిగా ఆడబోయిన హార్లీన్ డియోల్ కూడా 17 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యింది.

22 పరుగులు చేసిన లిచ్ ఫీల్డ్, 10 పరుగులు చేసిన డాటిన్ కూడా వెంట వెంటనే అవుట్ అవడంతో, 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడిన గుజరాత్ జెయింట్స్ ను ఫుల్మలీ తన వీరోచిత ఇన్నింగ్స్ లో మళ్ళీ రేస్ లో కి తీసుకు వచ్చింది.

అయితే 25 బంతుల్లో 61 పరుగులు చేసిన ఫుల్మలీ అవుట్ అయిన తరవాత కన్వర్, సిమ్రాన్ లు పోరాడినా.  ఆఖరి ఓవర్లో కన్వర్ రన్ అవుట్ అవడం, ఆ తరవాత బంతికే సిమ్రాన్ బౌలింగ్ బౌల్డ్ అవడంతో పరిస్థితి గుజరాత్ జెయింట్స్ చేజారిపోయింది.

మాధ్యుస్ వేసిన ఆఖరి ఓవర్ లో మొదటి రెండు బంతుల్లో గుజరాత్ జెయింట్స్ వికెట్లు కోల్పోయింది. ఆ తరవాత రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి. ఆఖరి రెండు బంతులకు గుజరాత్ జెయింట్స్ పరుగులు ఏమి చేయలేకపోయింది

చివరకు 20 ఓవర్ల లో గుజరాత్ జెయింట్స్ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది

ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్, మాధ్యుస్ లు మూడేసి వికెట్లు తీయగా, ఇస్మాయిల్ రెండు వికెట్లు గుప్తా ఒక వికెట్ తీశారు.

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ క్వాలిఫై అయ్యారు.  రేపు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నామ మాత్రపు పోరులో తలపడతారు.

ఎలిమినేటర్ మ్యాచ్ మార్చ్ 13 న, ఫైనల్ మ్యాచ్ మార్చ్ 15 న జరుగుతుంది