నేడు ‘దిల్ రూబా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఫ్రీ బైక్ ఎవరిదో!

by | Mar 11, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, బ్యూటీ క్వీన్ రుక్సార్‌ థిల్లాన్‌ జోడిగా నటించిన తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. లవ్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లలో జోరు పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్దమయ్యారు మేకర్స్. ఈ కార్యక్రమాన్ని మార్చి 11న మంగళవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అయితే ‘దిల్ రుబా’ సినిమా కథని ఎవరైతే ఊహించి తమకు చెబుతారో వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీలో ఉపయోగించిన బైక్ గిఫ్ట్ గా ఇస్తానని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ముందే చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వారితో కలిసి అదే బైక్ మీద ఈ సినిమాకు రిలీజ్ రోజున వెళ్తానని హీరో కిరణ్ అబ్బవరం మాటిచ్చాడు. మరి ఈ మూవీ కథను చెప్పి ఆ బైక్ ను అందుకునేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాను శివమ్‌ సెల్యూలాయిడ్స్‌, సారెగమ మ్యూజిక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న.. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్‌ రుబా (Dilruba) మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.