‘ఛావా’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. తెలుగులో కలెక్షన్స్ ఎంతంటే.?

by | Mar 11, 2025 | సినిమా

బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. విడుదలైన ఫ‌స్ట్ రోజే నుంచే క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం సోమవారం నాటికి రూ.527 కోట్ల మైలురాయిని దాటేసింది.

ఇక మార్చి 7న ఈ సినిమా తెలుగులో విడుదలవగా.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజుల్లోనే 9.46 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఒక హిస్టారికల్ డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్​లో కలెక్షన్లు రావడం చాలా అరుదంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ‘ఛావా’ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మూవీని ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలోకి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.