ఈ సారి టొవినో థామస్, ఎన్టీఆర్ కాంబినేషన్

by | Feb 6, 2025 | సినిమా

ప్రభాస్ తో హీరోగా తీసిన సాలార్ లో మలయాళ స్టార్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని రంగంలోకి దింపారు మన దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో మరో మలయాళ నటుడు టొవినో థామస్ ని రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్

మిన్నల్ మురళి, 2018, ఎ ఆర్ ఎమ్ చిత్రాలతో టొవినో థామస్ మలయాళంలో బాగా పాపులర్ అయ్యాడు.  ఇందులో 2018, ఎ ఆర్ ఎమ్  చిత్రాలు మా టీవీ లో ప్రసారమయ్యాయి

ప్రశాంత్ నీల్ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది.  అయితే యాక్షన్ సినిమాలు తీసే ప్రశాంత్ నీల్ ఈ సారి ఎన్టీఆర్ ని ఎలాంటి మాస్ యాక్షన్ క్యారెక్టర్ లో చూపిస్తారో చూడాలి. కెజిఫ్, సలార్ సినిమాలు ఇప్పటికి యాక్షన్ ప్రేక్షకులను అలరిస్తాయి. సరి కొత్త డార్క్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించడం ప్రశాంత్ నీల్ ప్రత్యేకత.  మరి ఈ సారి కూడా కెజిఫ్, సలార్ సినిమాల లాగా డార్క్ బ్యాక్ డ్రాప్ థీమ్ తో తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.  అతి త్వరలో ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోబోతున్నాడు.  కాబట్టి ఆ ఫ్యాన్ మీట్ లో ఎన్టీఆర్, అభిమానులకు ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటాడో చూడాలి