అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు, స్పష్టమైన మెజారిటీ తో, భాజపా అధికారం లో కి వస్తుందని చెపుతున్నాయి. ప్రస్తుతరం అధికారం లో ఉన్న ఆప్ 20-30 స్థానాలు గెలుచుకుంటుందని, మరో సారి కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదు అని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి
| AAP | BJP | Congress | |
| Republic P Mark | 21-31 | 39-49 | 0-1 |
| Times Now | 22-31 | 39-45 | 0-2 |
| Peoples Pulse | 10-19 | 51-60 | 0 |
| Chanakya Strategy | 25-28 | 39-44 | 2-3 |
| JVC Exit Poll | 22-31 | 39-45 | 0-2 |
| ABP Matriz Exit Poll | 32-37 | 35-40 | 0-1 |
| Peoples Insight | 25-29 | 40-44 | 0-1 |
| CNN | 26 | 44 | 0 |
భాజపాకు ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమైన మెజారిటీ రావడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి
- ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం భాజపా కు అనుకూలంగా మారిందని చెప్పవచ్చు.
- కలుషిత నీరు, అస్తవ్యస్తమైన రోడ్లు, ఆప్ అవినీతి వంటి అంశాలు ఆప్ పట్ల ఓటర్లు అసంతృప్తిగా ఉండవచ్చు.
- కేంద్రంలో అధికారం లో ఉన్న భాజపా కు ఓటు వేస్తే అభివృద్ధి జరగవచ్చు అన్న అభిప్రాయానికి రావచ్చు
- ఇప్పటిదాకా కాంగ్రెస్, ఆప్ పార్టీ లకు వరస అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు ఈ సారి భాజపాకు అవకాశమిచ్చారని ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం గా చెపుతున్నాయి
- బడ్జెట్ లో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ఉద్యోగులకు, ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించడం భాజపా కు కలసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటె ఢిల్లీ మధ్య తరగతి ప్రజలు 60% ఉన్నారు
- 10 సంవత్సరాలు అధికారం లో ఉన్నా వాయు కాలుష్యం నివారణకు ఆప్ ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం
- ప్రతి దానికి అభివృద్ధి కి గవర్నర్, భాజపా సహకరించడం లేదని వారిపై నిందలు వేయడం
మహాకుంభమేళా లో ప్రధాన మంత్రి మోడీ చేసిన పూజలు నిజంగా ఫలించాయి అని చెప్పవచ్చు.
అయితే ఫిబ్రవరి 8 న కౌంటింగ్ జరగనుంది. ఏమైనా సంచలనాలు జరుగుతాయా లేదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకుంటాయా అనేది వేచి చూడాలి

