టాలీవుడ్ యువ హీరో నితిన్ (Nithin) కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు'(Thammudu) . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సీరియర్ నటి లయ (Laya) కీలక పాత్రలో కనిపించనుంది. కుటుంబ భావోద్వేగాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం నితిన్ గత చిత్రాలకు డిఫరెంట్ గా చాలా క్రియేటివ్‌గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఇటీవల ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేసిన మేకర్స్.. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
అయితే, ‘తమ్ముడు'(Thammudu) సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌కి సంబంధించిన గ్రాఫిక్ వర్క్‌తో పాటుగా నిర్మాణానంతర పనులు కూడా పూర్తవకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. వేసవి కానుకగా ‘తమ్ముడు’ మొవీని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో మే 9వ తేదీకి ఒక సెంటిమెంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈరోజు విడుదలైన సినిమాలన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, మహానటి(Mahanati), మహర్షి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలన్నీ అదే రోజున విడుదలై ఘన వినయం సాధించాయి. దింతో ‘తమ్ముడు’ సినిమాను కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కాంతార(Kanthara), విరూపాక్ష (Virupaksha)సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

