నాన్న చేసిన పనికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు

by | Feb 28, 2025 | సినిమా

నాన్న చేసిన పనికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటిస్తోండగా.. అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడిగా, కాజల్ (Kajal) పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో (Mohan Babu) పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో ‘రుద్ర’ పాత్రను పోషించారు.

తాజాగా కన్నప్ప మూవీలో ప్రభాస్ (Prabhas) అతిథి పాత్రలో నటించడంపై హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో విష్ణు మాట్లాడుతూ.. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీలో గెస్ట్ రోల్ చేయాలని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా ఒక్క క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడు. ముందుగా మా నాన్న మోహన్ బాబు గారు ప్రభాస్ కు ఫోన్ చేసి అడగడంతో అతను చాలా టెన్షన్ పడ్డాడు. ఇదే విషయాన్ని షూటింగ్ సమయంలో నాకు చెప్పాడు. అలాగే నాతో ఏదైనా పనుంటే నువ్వే ఫోన్ చేయి నాన్నతో వద్దు అని తనతో ప్రభాస్ చెప్పినట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

ఇక అంతకుముందు ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఈ సినిమా చేశాడంటూ మంచు విష్ణు వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా, మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే,
అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ టీజర్ (Kannappa Teaser) మార్చి 1న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్.