నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

by | Feb 8, 2026 | క్రీడలు

టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil) నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ (Swayambhu) . భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్‌ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ (Samyukta Menon), నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక చాలా రోజులుగా ఈ సినిమా అప్‌ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ సినిమా టీజర్‌ ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో హీరో నిఖిల్ (Nikhil) యోధుడిగా కత్తి పట్టుకొని పరుగెడుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించగా.. ఆ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ పనులు ఇంకా చాలానే ఉండటంతో ‘స్వయంభు’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో వేసవి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరి లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.