రంగంలోకి ‘సంక్రాంతి సోగ్గాళ్లు’.. ర‌చ్చ మాములుగా ఉండ‌దు!

by | Feb 8, 2026 | సినిమా

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna), ఆయన కుమారుడు నాగ చైత‌న్య (Naga Chaitanya) ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల (Kalyan Kurasala) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం 2016లో వ‌చ్చిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ గా రూపోందింది. జీస్టూడియోస్-అన్న‌పూర్ణ స్టూడియోస్ (Zee Studios & Annapurna Studios) సంయుక్తంగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా అంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌గా మరో కొత్త సినిమా రానున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. 2016లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2022లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇదే ప్రాంఛైజీలో 2027 సంక్రాంతి కానుకగా మరో సీక్వెల్‌ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. “వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా.. డేట్ మార్క్ చేసుకోండి..” అంటూ పోస్ట్‌ చేశారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హీరో నాగార్జున, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి మూడో పార్ట్ గా కొత్త సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇక మరోవైపు నాగార్జున ప్రస్తుతం తన వందో చిత్రంలో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కెరీర్‌లో తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారాయన. ప్రస్తుతం తన వందో చిత్రాన్ని రా కార్తీక్‌ దర్శకత్వంలో చేస్తున్నారు.