మళ్ళీ ఓడిన పాకిస్థాన్ ; ఓటమికి అలవాటుపడిన పాక్

by | Apr 5, 2025 | వార్తలు

పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ వన్ డే మ్యాచ్ లో న్యూజిలాండ్, పాకిస్థాన్ పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 42 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది

ఓపెనర్ నిక్ కెల్లీ 3 పరుగులే చేసి అవుట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ మరియు, హెన్రీ నికోల్స్ లు రెండవ వికెట్ కు 78 పరుగులు జోడించారు.  31పరుగులు చేసిన హెన్రీ నికోల్స్ తో పాటు 58 పరుగులు చేసిన ఓపెనర్ మరియు కూడా వెంట వెంటనే అవుట్ అవడంతో 103 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్

ఆ తరవాత వచ్చిన మిచెల్, సీఫెర్ట్ లు నాలుగవ వికెట్ కు 61 పరుగులు జోడించారు 26 పరుగులు చేసిన సీఫెర్ట్, 43 పరుగులు చేసిన మిచెల్ లు కూడా వెంట వెంటనే అవుట్ అయ్యారు.  అయితే కెప్టెన్ బ్రేస్ వెల్ ఒక వైపు నిలబడి నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలించసాగాడు  బ్రేస్ వెల్ 40 బంతుల్లో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు

పాకిస్థాన్ బౌలర్లలో అఖీఫ్ జావేద్ నాలుగు వికెట్ లు తీయగా, నసీం షా రెండు వికెట్ లు తీశాడు. ముఖీమ్, అష్రాఫ్ లు చెరో ఒక వికెట్ తీశారు

అనంతరం 265 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు,  స్కోర్ 5 పరుగుల వద్ద, ఓపెనర్ ఇనాముల్ హాక్ రిటైర్డ్ హర్ట్ గా వెను  తిరిగాడు

ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన బాబర్ అజామ్, మరో ఓపెనర్ షఫీక్ తో రెండవ వికెట్ కు 68 పరుగులు జోడించారు. అయితే ఆ తరవాత నుండి ఎక్కడ పెద్ద పెద్ద భాగస్వామ్యాలు లేకుండా, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది పాకిస్థాన్

బాబర్ ఆజామ్ 50 పరుగులు, షఫీక్ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాక పాకిస్థాన్ కు అన్ని కష్టాలే. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 37 పరుగులు, తాహిర్ 33 పరుగులు చేశారు

చివరకు పాకిస్థాన్ పూర్తిగా 42 ఓవర్లు ఆడకుండా 40 ఓవర్ల లో 221 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

న్యూజిలాండ్ బౌలర్ల లో సీర్స్ ఐదు వికెట్లు తీయగా, డఫీ రెండు వికెట్ లు తీశాడు. బ్రేస్ వెల్, అబ్బాస్, మిచెల్ లు తలా ఒక వికెట్ తీశారు