‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ బ్లాక్ బస్టర్ ఇంటర్వూ రేపే

by | Apr 5, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. 

ఈ సినిమా కు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఎపిసోడ్ ని మేకర్స్ రేపు శ్రీ రామనవమి కానుకగా ఉదయ 11:07 గంటలకు విడుదల చేయనున్నారు

ఈ ఇంటర్వ్యూ లో  కళ్యాణ్ రామ్, విజయ శాంతి గారు, అనిల్ రావిపూడి గారు ముగ్గురు ఉన్నారు.  ఈ ముగ్గురిని సుమ ఇంటర్వ్యూ చేసింది. ఇంతకీ ఈ సినిమా ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి ఎందుకు ఉన్నాడు అనేనా మీ సందేహం. అయితే ఈ ప్రోమో చూడండి, ఆ లాజిక్ ఏంటో తెలుసుకోండి

ఇందులో సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.