టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) కథానాయకుడిగా రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్ (The Paradise) ‘. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మోహన్ బాబు, తనికెళ్ల భరణీ, కిల్ ఫేం రాఘవ్ జుయల్ సంపూర్ణేష్ బాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా కయాదు లోహర్ కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని తల్లిగా కనిపించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ‘జడల్’ (Jadal) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం నాని అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని (Nani) ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ పాట గురించి చెప్పాలి అంటే నాని తన స్వాగ్‌తో డాన్స్‌తో అలరించబోతుండగా.. ఈ స్టైలిష్ ఎంట్రీ సాంగ్ లో నాని వేసే మూమెంట్స్ సినిమాకే హైలెట్‌గా నిలవబోతున్నాయట. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో భారీ కాస్ట్యూమ్స్, వందలాది మంది డ్యాన్సర్స్ తో చాలా గ్రాండ్ గా ఈ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో నాని ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని అనుకున్నా, ఇప్పుడు జూలై 25కు వాయిదా వేసే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది

