తెలుగులో విభిన్న కథా చిత్రాలు చేస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యువ కథానాయకుడు విశ్వక్ సేన్.(Vishwak Sen) తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న ఈ యువ హీరో గత కొంతకాలంగా ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఆయన నటించిన చివరి సినిమా ‘లైలా’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫంకీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ (Funky) సినిమాకు ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్ (Anudeep) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ (Srikara Studios) సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్ (Sithara Entertainments) , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ (Trailer) ఆద్యంతం ఆకట్టుకోంటుంది. ‘ఆసుపత్రిలో మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి అంటే.. నాకు రాదు డాక్టర్’ అంటూ డైరెక్టర్ అనుదీప్ తన మార్కు కామెడీ మొదలెట్టాడు. అక్కడ నుంచి నాన్ స్టాప్ ఫన్ తో ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులతో సాగింది. అనుదీప్ టేకింగ్, విశ్వక్ (Vishwak) కామెడీ టైమింగ్ తో ఈ ట్రైలర్ కడుపుబ్బా నవ్విస్తోంది. మరి ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి…

