ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli దర్శకత్వంలో మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి (Varanasi) ’. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ రేంజ్ టెక్నికల్ టీమ్, పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌తో ‘వారణాసి’ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మీడియాతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమాతో పాటుగా తన గత సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ (NTR) , రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటించింది. డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి (Rajamouli) మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను యానిమేషన్ చిత్రంగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి తాను ఇప్పటికే జపాన్ కు చెందిన ప్రముఖ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నానని రాజమౌళి అన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని ఈ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు. కాగా, ‘బాహుబలి’ (Bahubali Animation Series) ఫ్రాంచైజీలోని రెండు భాగాలను కలిపి యానిమేషన్ సిరీస్‌గా రూపొందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఇషాన్ శుక్లా (Ishan Shukla) దర్శకత్వం వహిస్తుండగా.. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మొదటి భాగం 2027 లో రిలీజ్ కానుంది.

