నాని ఊర మాస్ అవతారం ; స్టార్ స్టేటస్ గ్యారంటీనా

by | Aug 8, 2025 | సినిమా

నాచురల్ స్టార్ నాని కి ఫామిలీ ఆడియన్స్ తో పాటు, యువతలోనూ క్రేజ్ ఉంది. నాని సినిమాలకు ఓపెనింగ్స్ గ్యారంటీ అనే స్టేజి కి వచ్చాడు

2008 లో అష్టా చమ్మ తో కెరీర్ ప్రారంభించిన నాని భలే భలే మగాడివోయ్, ఏం సి ఏ, నేను లోకల్, నిన్ను కోరి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జెర్సీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు

అయితే 2023 లో వచ్చిన దసరా (Dussera) సినిమాతో నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.  నాని (Natural Star Nani) కెరీర్ లో 100 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా. 

ఆ తరవాత వచ్చిన హాయ్ నాన్న, 100 కోట్లు వసూలు చేయక పోయిన, బాగానే హిట్ అయ్యింది.  అయితే దసరా సినిమాతో నాచురల్ స్టార్ నాని యాక్షన్ బాట పట్టాడు.  ఆ తరవాత వచ్చిన సరిపోదా శనివారం సినిమా, నాని కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన రెండవ సినిమా.  హిట్ 3 సినిమా తో పూర్తి యాక్షన్ హీరో గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించాడు.    నాని కెరీర్ మొదటి 40 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం హిట్ 3.  ప్రపంచ వ్యాప్తంగా హిట్ 3 (HIT 3), సుమారు 120 కోట్ల దాగా వసూళ్లు సాధించింది.  నాని కెరీర్ లో 100 కోట్లు వసూలు చేసిన మూడు చిత్రాలు యాక్షన్ చిత్రాలే.

ఈ సందర్భం లో హిట్ 3 లో కొన్ని డైలాగులు గురుతుకు తెచ్చుకుందాం.  నువ్వు ఇక్కడ బతకలేవు, అంటే, నాని చెప్పిన డైలాగు ‘ నా కెరీర్ ప్రారంభం నుండి ఈ మాట వింటున్నాను’ అని నాని చెప్పే డైలాగు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.  హిట్ 3 సినిమాలో ,ఈ డైలాగు నాని నిజ జీవితానికి దగ్గరగా ఉంది.  ఈ సినిమాలోనే నాని ని అందరూ క్లాస్ అనుకుంటున్నారు, ఒరిజినల్ ఏంటో చూస్తారు అని అర్ధం వచ్చే డైలాగు ఉంది. 

ఈ డైలాగ్స్ అన్ని నాని ని ఒక మాస్ హీరో గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడ్డాయి.  అయితే దసరా సినిమాతో , నాని యాక్షన్ అవతారానికి ఊపిరి పోసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. 

ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని (Natural Star Nani) నటిస్తోన్న ది పారడైస్ (The Paradise) చిత్రం నుండి రెండు పోస్టర్ లు విడుదల చేశారు.  నాచురల్ స్టార్ నాని, ఈ పోస్టర్స్ లో , ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు.  ఒక పోస్టర్ లో జడలతో నాని కనిపిస్తే, రెండవ పోస్టర్ లో చుట్టూ అంత మంది  మీద పడేలా ఉన్నా, నాని ఒక ఆటిట్యూడ్ తో ఆలా కూర్చోవడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది 

ఈ రెండు పోస్టర్స్ చూస్తే నాని, పాన్ ఇండియా లెవెల్ లో గట్టిగా కొట్టి, స్టార్ స్టేటస్ అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది.  ఈ చిత్రాన్ని 2026 మార్చ్ లో పాన్ ఇండియా స్థాయిలో (బెంగాలీ, ఇంగ్లీష్ బాషలతో) భారీగా విడుదల చేయనున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నానికి మాస్ ఇమేజ్ వస్తే, ఆపడం ఎవరి తరం కాదు.  అల్లు అర్జున్ (Allu Arjun) కి పోటీ వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై, చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.