మహేష్ బాబుకు, మెగా స్టార్ చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్

by | Aug 9, 2025 | సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు కు నేటి తో 50 సంవత్సరాలు నిండి 51 వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు.  50 వ పుట్టిన రోజు జరుపుకుంటోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎక్స్ వేదికగా తెలియచేశారు.  అంతే కాకుండా తన ట్వీట్ లో మహేష్ బాబు ను ప్రైడ్ అఫ్ తెలుగు సినిమాగా అభివర్ణించారు.

ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దుర్గ ఆర్ట్స్ పతాకం పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు.  ఈ సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్లు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2027 లో  భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు