అనుష్క నట విశ్వరూపం ; ఘాటీ పై భారీ అంచనాలు

by | Aug 6, 2025 | సినిమా

అనుష్క షెట్టి పేరు వినగానే గ్లామర్ పాత్రలకే కాదు, నటనకు అవకాశమున్న పాత్రలలోను మెప్పిస్తుంది.  లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని మనందరికి తెలిసిందే.  2023 లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తరవాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం లో వస్తోన్న చిత్రం ఘాటీ (Ghati).  అనుష్క శెట్టి నుండి దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తరవాత వస్తోన్న చిత్రం కాబట్టి అంచనాలు బాగానే ఉంటాయి.

అయితే ప్రచారం విషయంలో ఘాటీ చిత్రం వెనుకబడిందని అనుకుంటున్న తరుణంలో, ట్రైలర్ తో అంచనాలను అమాంతం పెంచేశాడు దర్శకుడు క్రిష్.  అనుష్క శెట్టి నట విశ్వరూపం చూపించారు.  అరుంధతి, భాగమతి, రుద్రమదేవి చిత్రాల తరవాత అనుష్క శెట్టి (Anushka Shetty) మరో పవర్ రోల్ లో ఈ ఘాటీ చిత్రంలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ ప్రారంభంలో ఘాటీల  గురించి చెప్పేసారు.  బ్రిటిష్ వారి కాలంలో కొండలు బద్దలు కొట్టి, రక్తం తో  రోడ్లు వేసేవారు ఈ ఘాటీ లు.  ఇప్పుడు గంజాయి మోసే కంచర గాడిదలు.  దీనిని బట్టి గంజాయి సాగు, దానిని తరలించడం వంటి అంశాల చుట్టూ ఈ కధ తిరుగుతుందని తెలుస్తోంది

ట్రైలర్ చివరలో , సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దురు గాని అనే సంభాషణ ఆకట్టుకుంది

ఒక బాధితుడు,  క్రిమినల్ గా ఎలా మారాడు, ఆ తరవాత లెజెండ్ (గా ఎలా ఎదిగాడు అనేది ఈ ఘాటీ చిత్రం

విక్రమ్ ప్రభు, అనుష్క శెట్టి (Anushka Shetty) నటిస్తోన్న ఈ ఘాటీ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి లు నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ (UV creations) సమర్పణలో, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ (Krish)

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘాటీ (Ghati) చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు