టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్’: ది థర్డ్ కేస్’ ఫుల్ లెంగ్త్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు.
వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే అప్‌డేట్ వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘హిట్ 3’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సెన్సార్ వారు ఏ సర్టిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ సర్టిఫికేట్ అంటే అడల్ట్స్ ఓన్లీ అని. దింతో ఈ చిత్రానికి చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు దూరంగా ఉండాల్సి రానుంది. దీంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగించాలని, మరికొన్ని డైలాగుల్లో మార్పులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో రక్తపాతం ఉన్న సీన్లు బ్లర్ చేయమని సెన్సార్ బోర్డు ఆదేశించిందని తెలుస్తోంది. ఈ సినిమాలోని వివిధ సన్నివేశాలపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే నాని హిట్ 3 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో రక్తపాతం ఎక్కువగా ఉంటుందని, చిన్న పిల్లలు దూరంగా ఉండాలని అన్నాడు. ఇప్పుడు అదే నిజమైంది. దీంతో హిట్ 3 సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు అనుకుంటున్నారు. ఇక హిట్ 3 సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. మూడు వారాల ముందే చిత్ర బృందం సెన్సార్ చేయించారు. ఇక ఏప్రిల్ 14న విశాఖపట్నంలోని సంగం థియేటర్‌లో ఉదయం 10: 30 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. అనంతరం ట్రైలర్‌ను 11:07 గంటలకు ఆన్‌లైన్‌లో కూడా రిలీజ్ చేయనున్నారు.

