ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ కు రోహిత్ శర్మ, రికెల్టన్ లు మొదటి వికెట్ కు 47 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. ఎప్పటిలాగే రోహిత్ శర్మ 18 పరుగులు చేసి తొందరగా అవుట్ అయ్యాడు. ఆ తరవాత, జట్టు స్కోర్ కు మరో 28 పరుగులు జోడించిన తరవాత, 25 బంతుల్లో 41 పరుగులు చేసిన మరో ఓపెనర్ రికెల్టన్ కూడా అవుట్ అయ్యాడు
వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఆ తరవాత వచ్చిన తిలక్ వర్మ లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 60 పరుగులు జోడించిన అనంతరం, 28 బంతుల్లో 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య రెండు పరుగులు చేసి వెంటనే అవుట్ అయ్యాడు. అయితే మరో వైపు తిలక్ వర్మ ధాటిగా ఆడుతూ ఉండగా, నమన్ ధిర్ అతనికి జత కలిశాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ ఐదవ వికెట్ కు 62 పరుగులు జోడించారు. అయితే, 33 బంతుల్లో 59 పరుగులు చేసిన తిలక్ వర్మ 20 వ ఓవర్ నాలుగవ బంతికి అవుట్ అయ్యాడు. నమన్ ధిర్ 17 బంతుల్లో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు
ముంబై ఇండియన్స్ జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది అంటే అది తిలక్ వర్మ, నమన్ ధిర్ ల చలవే
చివరకు ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కులదీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ లు రెండేసి వికెట్ లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీశారు.

