‘రెడీ బాయ్స్’ అంటున్న అర్జున్‌ సర్కార్‌.. ఫ్యాన్స్​కు ఫుల్ మీల్సే!

by | Feb 22, 2025 | సినిమా

తెలుగు చిత్రసీమలో నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీస్ అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే టీజర్ మీద ఆసక్తి పెంచేలా సర్కార్ లాఠీ పేరుతో తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఇందులో హోమిసైడ్ ఇంట్రవెన్షన్ టీమ్, శ్రీనగర్, జమ్మూకాశ్మీర్ స్టేషన్ ముంగిట కానిస్టేబుల్స్ నిల్చుని ఉండగా.. వారి ఎదుట లాఠీ పట్టుకొని నిల్చున్న నాని ‘రెడీ బాయ్స్’ అని చెప్పే డైలాగ్ టీజర్ మీద అంచనాలను మరింత పెంచేసింది. కాగా, హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకుముందు యువ హీరోలు విష్వక్‌ సేన్‌ ‘హిట్‌’, అడివి శేష్‌ ‘హిట్‌ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్​ 3’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా వేసవి కానుకగా మే 1న విడుదల కానుంది. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.