ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, లాహోర్ లో ఈ రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయా దేశాల జాతీయ గీతాలను ప్లే చేయడం ఆనవాయితీ. అయితే ఈ రోజు, ఆస్ట్రేలియా జాతీయ గీతం బదులు, మన భారత దేశ జాతీయంగా గీతం అయిన ‘జనగణమన’ ను ప్లే చేశారు. ఒక్కసారి ఆస్ట్రేలియా ప్లేయర్ లు ఖంగు తిన్నారు. స్టేడియం లో అభిమానులు కూడా ఈ దెబ్బకు ఖంగు తిన్నారు.
వెంటనే అధికారులు జరిగిన . తప్పును గ్రహించి మన జాతీయ గీతాన్ని ఆపేసి, ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు.
ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వేదిక గా జరుగుతోంది. భద్రత కారణాల దృష్ట్యా బీసీసీఐ భారత జట్టును పాకిస్థాన్ పంపడానికి నిరాకరించింది. అందుకే భారత్ ఆడే మ్యాచ్ లన్ని దుబాయ్ వేదికగా జరుగనున్నాయి.
పొరపాట్లు సహజం, అది ఎవరికైనా..!

