మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంపై 46 సంవత్సరాలుగా మకుటం లేని మహారాజు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. అంతేకాకుండా నేటి తరం లో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మెగా స్టార్ చిరంజీవి.
బ్రిటిష్ ఫిలిం మేకర్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ 125 వ జయంతి సందర్భంగా, అంతే కాకుండా ఆయన మొదటి సినిమా విడుదలై 100 సంవత్సరాలైనా సందర్భంగా ఈ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ బుక్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు. . హిచ్‌కాక్ 1899 ఆగష్టు 13 న జన్మించారు. ఆయన మొదటి సినిమా ది ప్లెషర్ గార్డెన్
సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ, ఐఆర్టిఎస్ అధికారి రవి పాడితో కలిసి ఈ బుక్ ని మార్కెట్ లో కి తీసుకు వచ్చారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. అంతే కాకుండా రామ్ గోపాల్ వర్మ కూడా రాశారు.
ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి పులగం చిన్నరాయణ ని అభినందించారు
ఈ విషయంపై రచయిత పులగం చిన్నారాయణ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిట్కాక్” యొక్క మా 2వ ఎడిషన్‌ను ప్రారంభించినందుకు #MegastarChiranjeevi గారు ధన్యవాదాలు. మీలాంటి మరొక ‘లెజెండ్’ నుండి అతని 125వ వార్షికోత్సవం సందర్భంగా లెజెండ్‌కు ఇది గొప్ప నివాళి.
https://twitter.com/PulagamOfficial/status/1893193164715909455

