ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 పరుగులు, వన్ డౌన్ లో వచ్చిన స్మిత్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యారు
అయితే మరో ఓపెనర్ డకెట్, జో రూట్ మూడవ వికెట్ కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 68 పరుగులు చేసిన జో రూట్ జంపా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఆ తవాత వచ్చిన హరీ బ్రూక్ తన పూర్ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతని మరో సారి బయట పెట్టుకున్నాడు. 3 పరుగులు చేసిన బ్రూక్ స్పిన్నర్ జంపా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన, కెప్టెన్ బట్లర్ 23 పరుగులు, లివింగ్ స్టోన్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు
మరో ఓపెనర్ డకెట్ క్రీజ్ లో పాటుకు పోవడమే కాకుండా దూకుడైన ఆట ఆడాడు. 143 బంతుల్లో 165 పరుగులు చేసి లబుషేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆస్ట్రేలియా బౌలర్ల లో ఆస్ట్రేలియా బౌలర్ల లో మూడు వికెట్లు తీయగా, స్పిన్నర్ జంపా, లబుషేన్ చెరో రెండు వికెట్లు తీశారు. మాక్స్ వెల్ ఒక వికెట్ తీశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ లో సెంచరీల మోత మోగిపోతోంది. ఇప్పటివరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో 6 సెంచరీలు నమోదయ్యాయి

