ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న నాని.. వామ్మో మరీ ఇలానా!

by | Mar 4, 2025 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే హిట్ 3 మూవీ రిలీజ్ కు రెడీగా ఉండగా.. ద‌స‌రా లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘ది ప్యారడైజ్’ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇందులో నాని లుక్, మేకింగ్ అనేది సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా ఇందులో నాని లుక్ ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. అయితే, నాని తన గతకొన్ని సినిమాలలో గురువారం సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు.

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా 2023 మార్చి 23న గురువారం విడుదలవగా.. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న చిత్రం 2023 డిసెంబర్ 7న గురువారం రిలీజ్ అయింది.
అనంతరం వచ్చిన సరిపోదా శనివారం మూవీ 2024 ఆగస్టు 29న గురువారం విడుదలవగా.. హిట్ 3 మూవీ ఈ ఏడాది మే 1న గురువారం రిలీజ్ కానుంది. అలాగే 2026, మార్చి 26న విడుదల కానున్న ‘ది ప్యారడైజ్’ మూవీ కూడా గురువారమే విడుదల కానుంది. ఇలా తన సినిమాలను గురువారం రోజున విడుదల చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నాడు నాని. ఈ క్రమంలోనే తన రాబోయే చిత్రాలను కూడా అదే సెంటిమెంట్‌తో గురువారం విడుదల చేస్తూ బాక్సఫీస్ బాద్షాగా కొనసాగాలని నాని భావిస్తున్నాడు.