‘హిట్‌ 3’ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

by | Apr 11, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్‌ సర్కార్‌ (Nani) అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా,(Wall Poster Cinema) యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని వదిలారు.

హిట్ 3 (HIT) సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 14న ఉదయం 11.07 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అయితే పాన్‌ ఇండియా రిలీజ్‌ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్‌లు ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఇక హిట్ 3 సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పెషల్ రోల్ చేయనుండగా.. ఆయనే ‘హిట్‌ 4’ లో హీరోగా చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘హిట్‌ 3’ చివర్లో రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూవీ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇదిలాఉంటే.. హిట్ 3 సినిమా విడుదలకు ముందే సెన్సేషనల్ ప్రీ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రూ.60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలకు ముందే లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. హిట్ 3 మూవీ ఓటీటీ రైట్స్ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ రూ.54 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ మూవీ ఆడియో రైట్స్ రూ.6కోట్లుకు అమ్ముడుపోయాయి. దింతో ఇక్కడికే రూ.60కోట్లు హిట్ 3 ఖాతాలో చేరాయి. హిట్ 3 సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.