‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ – రిలీజైన 8 గంటల్లోనే సినిమా లీక్

by | Apr 11, 2025 | సినిమా

కోలీవుడ్ సీనియర్ కథానాయకుడు అజిత్ కుమార్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించగా.. సునీల్, ప్రసన్న, యోగిబాబు, రాహుల్‌ దేవ్‌, అర్జున్‌ దాస్‌, ప్రభు ఇతక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందించారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకోని దూసుకుపోతోంది.

అయితే ఈ మూవీ రిలీజైన తొలి రోజే నష్టం కలిగే పని జరిగింది. అదే పైరసీ. ఈ మధ్య చాలా సినిమాలు రిలీజైన రోజే పైరసీకి గురవుతున్నాయి. ఇటీవలి కాలంలో విడుదలైన తండేల్, ఛావా, సికిందర్ ఇలా పైరసీ బారిన పడ్డాయి. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదలైన 8 గంటల్లోనే
ఎవరో పైరసీ చేసి ఫుల్ హెచ్ డీ ప్రింట్ ని సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇది తెలిసిన చిత్ర యూనిట్ వెంటనే పోలీసులని ఆశ్రయించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పొచ్చు. తమిళ్ రాకర్స్ తో పాటుగా పలు వెబ్ సైట్స్, వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన లింక్ షేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక 280 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ. మూవీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి ధరకు అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ గా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఇవేన్ సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా బాక్సఫీస్ వద్ద రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది.