‘కల్కి-2’ – అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

by | Apr 5, 2025 | సినిమా

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నటించిన చిత్రం ‍’‍కల్కి'(Kalki 2898 AD). అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్​, విజయ్‌ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ ప‌నుల‌లో బిజీగా ఉన్నారు. అయితే నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక దత్‌ దంపతులు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే దర్శనం ముగించుకొని ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్‌-2 అప్‌డేట్‌ గురించి అబిమానులు ఆయన్ని అడిగారు.

ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని మొక్కుకున్నాను. ఇక ప్రభాస్ కల్కి2 సినిమా విషయనికొస్తే.. ఈ సినిమా మొదలవడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఇది పూర్తవగానే రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ ప్రారంభిస్తాం.. నా అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది” అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రేజీ సీక్వెన్స్ లో కర్ణుడిగా ప్రభాస్‌, అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్ డెవిల్‌ యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో ‘కల్కి’ చిత్ర నిర్మాతలు స్వప్న- ప్రియాంక ఈ సినిమా షూటింగ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘కల్కి'(Kalki) తో పాటే ఈ మూవీ సీక్వెల్‌కు సంబంధించి 35 శాతం షూట్‌ జరిగిందని తెలిపారు. ఇక కల్కి 2 సినిమాను కూడా వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ మరోసారి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇదిలాఉంటే. ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘ది రాజా సాబ్‌’ ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’ (Spirit) , ‘సలార్‌2’ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.