‘బి’ గ్రేడ్ హీరో లు మైత్రి మూవీ మేకర్స్ కు కలిసి రారా. పెద్ద హీరోలు, పాన్ ఇండియా చిత్రాలే కలిసి వస్తాయా
మైత్రి మూవీ మేకర్స్, భారత దేశం లోనే అతి పెద్ద చిత్రం నిర్మాణ సంస్థ అని చెప్పవచ్చు. చిత్ర నిర్మాణ రంగంలోనే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా నైజాం లో అనేక చిత్రాలను పంపిణి చేశారు. 2015 లో ప్రారంభించిన మైత్రి మూవీ మేకర్స్ కు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ లు మైత్రి ప్రతినిధులుగా ఉన్నారు.
ఇటీవలే మైత్రి వారు పుష్ప 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పుష్ప విజయంతో పాటు కొండంత అపఖ్యాతిని కూడా మూట కట్టుకున్నారు
మైత్రి వారు మొదటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన శ్రీమంతుడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మహేష్ బాబు తో సర్కారు వారి పాట తో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు
ఆ తరవాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగ స్థలం, అల్లు అర్జున్ తో పుష్ప చిత్రాలతో ఇండస్ట్రీ హిట్ లు కొట్టారు
సీనియర్ హీరో లు చిరంజీవి తో వాల్తేరు వీరయ్య, బాల కృష్ణ తో వీర సింహారెడ్డి లు తీసి విజయాలను అందుకున్నారు
అయితే మైత్రి వారు ‘బి’ గ్రేడ్ తో తీసిన సినిమాలు దాదాపుగా అన్ని పరాజయం పాలయ్యాయి. మైత్రి వారు తీసిన చిన్న చిత్రాలలో వైష్ణవ్ తేజ్ తో తీసిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవగా, సాయి ధరమ్ తేజ్ తో తీసిన చిత్రలహరి పరవాలేదనిపించింది. మత్తు వదలరా చిత్రాలు కూడా బాగానే ఆడాయి
సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోనీ, డియర్ కామ్రేడ్, నాని గ్యాంగ్ లీడర్, అంటే సుందరానికి, అమిగోస్, ఖుషి, ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్ చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. వీటిలో కొన్ని సినిమాలు బాగానే ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి
ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ హీరో గా వస్తోన్న తమిళ్ చిత్రం గుడ్, బాడ్, అగ్లీ ఏప్రిల్ 10 న విడుదలవుతోంది. హిందీ సన్నీడియోల్ తో తీసిన జాట్ సినిమా కూడా ఈ నెల 10 న విడుదలవుతోంది. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు
ఇంకా పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా షూట్, విడుదల పవన్ కళ్యాణ్ డేట్స్ ని బట్టి ఉంటుంది
ఇవే కాకుండా 2026 లో మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా, రామ్ చరణ్ సినిమా, ప్రభాస్, హను రాఘవపూడి, జై హనుమాన్ చిత్రాలతో పాటు విజయ దేవరకొండ తో ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు
ప్రస్తుతం నిర్మించే చిత్రాలన్నీ పెద్ద హీరోలతో తీస్తున్నవే. విజయ దేవరకొండ, జై హనుమాన్ సినిమాలు తప్ప. ఇప్పటికే సూపర్ హిట్ అయ్యిన ఫాంటసీ చిత్రం హనుమాన్ కు సీక్వెల్ జై హనుమాన్. ఈ సీక్వెల్ లో మైత్రి వారు వచ్చి జాయిన్ అయ్యారు

