ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్మ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మార్ష్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మార్క్రమ్ ధాటిగా ఆడి 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు
పూరం 30 బంతుల్లో 44 పరుగులు చేయగా, ఆయుష్ బాధొని 41 పరుగులు చేశాడు. మిల్లర్ 19 పరుగులు చేయగా చివర్లో సమద్ ధాటిగా ఆడి 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు
కెప్టెన్ రిషబ్ పంత్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పూరన్, బదోని లు నాలుగవ వికెట్ కు 54 పరుగులు జోడించారు. ఇదే లక్నో సూపర్ జెయింట్స్ లో అత్యుత్తమ భాగస్వామ్యం
పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, ఫెర్గుసన్, మాక్స్ వెల్, జాన్సెన్, చాహల్ లు తలా ఒక వికెట్ తీశారు

