WPL : ముంబై ఇండియన్స్ 195/4 ; రాణించిన హర్మన్, బృంట్

by | Jan 10, 2026 | వార్తలు

WPL : ముంబై ఇండియన్స్ 195/4 ; రాణించిన హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బృంట్

ఉమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premiere League) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఉమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నాశతానికి 195 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్ వుమెన్ జట్టు ఓపెనర్ అమేలియా కెర్ డక్ అవుట్ అయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన నాట్ సీవర్ బృంట్ తో కలిసిన మరో ఓపెనర్ కమలిని రెండవ వికెట్ కు 50 పరుగులు జోడించారు. అయితే 16 పరుగులు చేసి కమలిని అవుట్ అయ్యింది.  ఆ తరవాత వచ్చిన కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బృంట్ తో కలిసి మూడవ వికెట్ కు 66 పరుగులు జోడించింది.

నాట్ సీవర్ బృంట్ ధాటిగా ఆడి 46 బంతుల్లో 70 పరుగులు చేసి అవుట్ అయ్యింది.  ఆ తరవాత హర్మాన్ తోడుగా బ్యాట్  ఝుళిపించిన నికోలా క్యారీ 12 బంతుల్లో 21 పరుగులు చేసింది.  మరో వైపు హర్మాన్ ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతూ 42 బంతుల్లో 74 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది.  హర్మాన్ ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బౌలర్లలో నందని శర్మ రెండు వికెట్లు తీయగా, హెన్రీ, శ్రీ చరణి లు చెరో ఒక వికెట్ తీశారు

మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ వుమెన్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆడారు