India Vs NZ 1st ODI లో  భారత జట్టు విజయ లక్ష్యం 301 పరుగులు

by | Jan 11, 2026 | వార్తలు

భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య వడోదర లో జరుగుతోన్న మొదటి వన్ డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ కు ఓపెనర్లు కాన్వే, నికోల్స్ లు చక్కని శుభారంభాన్ని అందించారు.  వీరిద్దరు మొదటి వికెట్ కు 117 పరుగులు జోడించారు. కాన్వే 56 పరుగులు , నికోల్స్ 62 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు

అక్కడి నుండి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.  అయితే సెకండ్ డౌన్ లో వచ్చిన మిచెల్ గోడలా నిలబడి స్కోర్ బోర్డును కదిలిస్తూ వచ్చాడు. 71 బంతుల్లో 84 పరుగులు చేసిన మిచెల్ 48 వ ఓవర్లో అవుట్ అయ్యాడు. లోయర్ ఆర్డర్ ఆటగాడు, మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోన్న క్లార్క్ తో కలిసి మిచెల్ ఎనిమిదవ వికెట్ కు 42 పరుగులు జోడించారు.

క్లార్క్ 17 బంతుల్లో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  ఆఖరి ఓవర్ లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు క్లార్క్, జేమిసన్ లు 14 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 300 పరుగుల మార్క్ అందుకుంది

భారత జట్టు బౌలర్ల లో పేసర్ లు సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ లు తలా రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది